పద్మజ ఫిలింస్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రామ్అగ్నివేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వి.వి.రుషిక దర్శకురాలు. హనుమంత్‌రావు నాయుడు నిర్మాత. దర్శకురాలు మాట్లాడుతూ ‘మధ్య తరగతి కథ ఇది. తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ కథ సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు వినోదానికి పెద్దపీట వేశాం. ఓ వైవిధ్యమైన చిత్రంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, త్వరలో నటీనటులు వివరాలు తెలియజేస్తామని నిర్మాత పేర్కొన్నారు. ఈ సంస్థలో తనకిది రెండో చిత్రమని హీరో రామ్ అగ్నివేశ్ తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: సాయికార్తీక్.