I Love You Movie | పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ లో చక్రం తిప్పింది. స్టార్ హీరోలకు జోడీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉండేది. అయితే ఉన్నట్టుండి ఈ అమ్మడుకి టాలీవుడ్లో అవకాశాల కరువు ఏర్పడింది. దాంతో ఈ బ్యూటీ మంబైకి మకాం మార్చింది. ఇక ఇప్పుడు హిందీలో పలు వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఈ మధ్యనే బూ అంటూ బయపెట్టిన రకుల్.. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వస్తుంది. రకుల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఐ లవ్ యూ. నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవిల్ గులాటి హీరోగా నటించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కాస్త ఆసక్తిని రేకెత్తించింది. కాగా ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజయింది.
ట్రైలర్లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు. లవ్ ట్రాక్ తో స్టార్ట్ అయిన ట్రైలర్.. ఒక్కసారిగా థిల్లర్ మోడ్ లోకి వెళ్లింది. రకుల్ ను ఎవరో ఓ బిల్డింగ్ లో బంధించడం. రకుల్ మూతికి బాండ్ కట్టడం, దానిపై ఐ లవ్ యూ అని ఎరుపు రంగులో ఉండటం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రకుల్ ను ఎవరు బంధించారు? ఎందుకు బంధించారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా జూన్ 16 నుంచి జియో సినిమాస్ ఓటీటీలో విడుదల కానుంది. కాగా ఫ్రీ గా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ‘భారతీయుడు2’, ‘ఆయాలాన్’ సినిమాలో నటిస్తుంది.