రకుల్‌ప్రీత్ సింగ్ నటించిన చిత్రం ‘భూ’. ఈ నెల 27 నుంచి జియో సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నేరుగా స్ట్రీమ్ కానుంది. రకుల్‌తో పాటు విశ్వక్సేన్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, రెబ్బజాన్, మంజిమా మెహన్ లాంటి స్టార్ నటీనటులంతా ఈ చిత్రంలో కనిపించనున్నారు. విజయ్ దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. హారర్ అండ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుందని నిర్మాతలు తెలిపారు.