Rakul Preet Singh | ఇండస్ట్రీలో ఒక స్టార్కిడ్కు లభించినంత తేలిగ్గా మిగతావాళ్లకు అవకాశాలు రావు. అది వాళ్ల గొప్పతనం కాదు. వారి తల్లిదండ్రుల కష్టం.’ అన్నారు ఢిల్లీ భామ రకుల్ ప్రీత్‌సింగ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నెపోటిజానికి సంబంధించిన ప్రశ్న రకుల్‌కి ఎదురైంది. దీనిపై ఆమె ఆసక్తికరంగా స్పందించారు.
‘ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉన్న మాట వాస్తవం. దీనివల్ల అవకాశాలు కోల్పోయిన వారిలో నేనూ ఒకదాన్ని. అయితే.. నేను సైనికుడి కూతుర్ని. నాన్న సలహాలు, సూచనలతో ఎదిగిన దాన్ని. సిల్లీ విషయాల గురించి ఆలోచించి సమయం వృథా చేసుకునే తత్వం కాదు నాది.
అవకాశాలు కోల్పోవడం జీవితంలో ఓ భాగం. ఆ సినిమాలు మనవి కావు.. అనుకొని ముందుకు సాగా. ఏం చేస్తే వ్యక్తిగతంగా ఎదుగుతానో దానిపై శ్రద్ధ పెట్టా. ఆ వ్యక్తిత్వమే నన్ను నిలబెట్టింది. గొప్ప పాత్రలు పోషించేలా చేసింది’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్. ప్రస్తుతం ఆమె అజయ్‌దేవగణ్‌తో ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తున్నది.