
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ లో నయా జోష్ నింపుతుంటుంది ఢిల్లీ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఎప్పటికపుడు అందరినీ మోటివేట్ చేసేందుకు ప్రయత్నిస్తూనే..ఫిట్ నెస్ పాఠాలు కూడా చెప్తుంది. ఫిట్ నెస్ మంత్రను ఫాలో అవుతూ..అందరికీ ఫిట్ నెస్ సూచనలు చేస్తుంది. ఈ భామ తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసిన స్టిల్ అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ను కలిగిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్న స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ ఫీడ్ లో షేర్ చేసింది.
మీకు కడుపు నొప్పి వచ్చే దాకా నవ్వుకోండి..తర్వాత మరింత ఎక్కువగా..త్వరలోనే సిరీస్ రాబోతుంది..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ పోస్టుపై సమంత, లక్ష్మీ మంచు, ప్రగ్యా జైశ్వాల్ పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. అద్బుతం అని ప్రగ్యాజైశ్వాల్ కామెంట్ పెట్టింది. నెటిజన్లకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజా స్టిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో డాక్టర్ జీ సినిమా చేస్తోంది. మెడికల్ క్యాంపస్ డ్రామాగా తెరకెక్కుతోందీ చిత్రం. మరోవైపు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్ గన్ తో కలిసి మేడే చిత్రం చేస్తోంది. దీంతోపాటు థ్యాంక్ గాడ్ సినిమాలో నటిస్తోంది. తెలుగులో వైష్ణవ్ తేజ్ చిత్రంలో నటిస్తోంది.
Laugh until your belly hurts and then just a little bit more 😜🤪 #seriescomingsoon @RohanShrestha pic.twitter.com/o64kVCWcD0
— Rakul Singh (@Rakulpreet) August 5, 2021
ఇవి కూడా చదవండి..
Samantha Gym Video | సమంత రిస్కీ వర్కవుట్స్ వీడియో వైరల్
JokkeJokkeMeke Song | ‘జోకే జోకే మేకే’ పుష్ప సాంగ్ ఇంట్రడక్షన్ వీడియో కేక
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?