వ్యాయామం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పరిమితికి మించి శరీరాన్ని ఇబ్బందిపెడుతూ కష్టాలను కొనితెచ్చుకోవద్దని సలహా ఇచ్చింది కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే ఈ భామ రెండు నెలల క్రితం జిమ్‌లో గాయపడిన విషయం తెలిసింది. 80 కిలోల బరువును ఎత్తే క్రమంలో ఆమె వెన్నెముకపై అధికభారం పడటంతో అనారోగ్యానికి గురైంది. ఇటీవల కోలుకున్న ఈ భామ తన ఆరోగ్యం గురించి అప్డేట్ అందించింది. ఆరోగ్యపరంగా శరీరం అందించే సంకేతాలకు జాగ్రత్తగా గమనించాలని, అందుకు అనుగుణంగా నడచుకోవాలని సూచించింది. ‘వెన్నెముక గాయం రెండువారాల్లో తగ్గిపోతుందనుకున్నా. కానీ రెండు నెలల టైమ్ పట్టింది. ఈ గాయం వల్ల కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉంటున్నా. సరళమైన ఆహారాన్ని తీసుకుంటున్నా. మన శారీరక పరిమితిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. కానీ ఒక్కోసారి అంతకుమించిన శ్రమతో ఇబ్బంది పెడతాం. అలాంటి తప్పుల వల్లే అనుకోకుండా ప్రమాదంలో పడతాం’ అని చెప్పుకొచ్చింది ఇటీవల సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చిన రకుల్ ప్రీత్.. రాబోవు ఏడాదిలో తాను నటించిన మూడు చిత్రాలు విడుదలకానున్నాయని తెలిపింది.