ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్స్ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది.కాజల్ మాదిరిగానే ఈ అమ్మడు కూడా సీక్రెట్ ప్రేమ వ్యవహారం నడిపింది. ఎట్టకేలకు దానిపై ఓపెన్ అయింది. తన ఇన్స్టాగ్రామ్లో జాకీ బగ్నాని చేతిని పట్టుకుని నడుస్తున్న ఫొటోను షేర్ చేస్తూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయాన్ని తెలియజేసింది.
ఈ ఏడాది నాకు దొరికిన అతి పెద్దగిఫ్ట్ నువ్వు. నా జీవితాన్ని రంగులమయం చేశావు. ఎప్పుడు నవ్విస్తూనే ఉంటావు. ఇలా ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో మధర జ్ఞాపకాలను తయారు చేసుకుందాం అంటూ హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను వ్యక్తపరచింది. కాగా జాకీ బగ్నాని బాలీవుడ్ హీరో, నిర్మాత. ఆయనతో ఏడడుగులు వేయబోతున్న విషయాన్ని రకుల్ తన బర్త్ డే రోజున ప్రకటించడం విశేషం. ఈ రోజు రకుల్ 31వ వసంతంలోకి అడుగుపెట్టింది.
రీసెంట్గా కొండ పొలం సినిమాతో ప్రేక్షకులని పలకరించిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో పలు చిత్రాలతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ సినిమాలతో పాటు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఒక సినిమాలోనూ రకుల్ హీరోయిన్ గా చేస్తోంది. ఇలా బాలీవుడ్ లో బడా హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్.