ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్లు ఆల్బమ్స్ లో కూడానటిస్తున్నారు. అలా ఇప్పుడు ఓ ఆల్బమ్ తో ముందుకొస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అర్జున్ కపూర్ తో కలిసి అమ్మడు ఈ ఆల్బమ్ లో కవ్వించబోతోంది.
దిల్ హై దీవానా ఆల్బమ్ లో ఇప్పటికే ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ నెల 17న ఈ సాంగ్ విడుదల కాబోతోంది. రాధికరావు-వినయ్ సప్రూ డైరక్షన్ లో ఈ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరపుకుంది.
కొద్దిరోజుల క్రితమే రష్మిక కూడా ఇలానే ఓ ఆల్బమ్ ద్వారా అటు పంజాబీ ఇటు బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రముఖ పాప్‌సింగర్ బాద్ షాతో కలిసి టాప్ టక్కర్ సాంగ్ లో నటించి అందాల విందు చేసింది.