Narakasura |‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ‘నరకాసుర’ (Narakasura). సెబాస్టియన్ డైరెక్ట్ చేస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన నరకాసుర టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ నరకాసుర విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఈ చిత్రానికి Nawfal Raja Ais సంగీతం అందిస్తున్నారు. దీపావళికి ముందే నరకాసురుడు జ్వలిస్తాడు.. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది.
మీ ఆలోచనలే మీ శత్రువులు.. అనే ట్యాగ్‌లైన్‌తో హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ సంగీర్తన విపిన్, అపర్ణా జనార్దన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. నాజర్, శత్రు, శ్రీమాన్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్ బ్యానర్లపై అజ్జా శ్రీనివాస్, కరుమూరు రఘు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇంటెన్సివ్‌గా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. రక్షిత్ మరోవైపు ఆపరేషన్ రావణ్ (Operation RAAVAN) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన లుక్, గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
రిలీజ్ డేట్ లుక్..
Before Diwali Lights, #Narakasura Ignites! 💥
Worldwide grand release on 𝐍𝐨𝐯 𝟑𝐫𝐝!#NarakasuraOnNov3rd 🔱@RakshitAtluri @SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @sangeerthanaluv @AparnaJan @ais_nawfalraja @sumukhaoffl @idealfilmmaker #UshaPictures @tseriessouth pic.twitter.com/yN0tUS850w— BA Raju’s Team (@baraju_SuperHit) October 10, 2023
Worldwide grand release on 𝐍𝐨𝐯 𝟑𝐫𝐝!
Release Date Announcement Event Pics 📸📸 #NarakasuraOnNov3rd 🔱@RakshitAtluri @SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @sangeerthanaluv @AparnaJan @ais_nawfalraja @sumukhaoffl @idealfilmmaker #UshaPictures @tseriessouth pic.twitter.com/mEpTIPoXzZ
— BA Raju’s Team (@baraju_SuperHit) October 10, 2023
నిన్ను వదిలి మెలోడీ ట్రాక్..
నరకాసుర టీజర్
ఆపరేషన్ రావణ్ టీజర్