OTT | చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం “రాజు వెడ్స్ రాంబాయి” . బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా, మూడు రోజుల్లోనే రూ. 7.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుంది.. ప్రమోషన్స్ కంటే మౌత్ టాక్ ఈ సినిమాకు పెద్ద బలంగా మారింది. చిత్రం సక్సెస్ కావడంతో “రాజు వెడ్స్ రాంబాయి” ఎప్పుడు, ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుందన్న కుతూహలం పెరిగింది. తాజాగా ఈ విషయానికి సంబంధించి కీలక వివరాలు బయటపడ్డాయి.
ఈ చిత్రానికి డిజిటల్ రైట్స్ ETV Win సొంతం చేసుకుంది.నిర్మాత బన్నీ వాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, సాధారణంగా తెలుగు చిత్రాలు విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తాయి. అయితే “రాజు వెడ్స్ రాంబాయి” మాత్రం థియేటర్లలో 50 రోజులు పూర్తి అయిన తర్వాతనే OTTలో రిలీజ్ కానుంది.అందువల్ల ఈ సినిమా సంక్రాంతి 2026 సమయంలో (జనవరి 10–16 మధ్య) ETV Winలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకా చాలాకాలం థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించే అవకాశం ఉంది. ఈ చిత్రంతో సాయిలు కాంపాటి దర్శకుడిగా పరిచయం కాగా, హీరో చైతన్య జొన్నలగడ్డ తన నేచురల్ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ప్రేక్షకులకు మంచి కనెక్ట్ అయ్యింది.
చైతన్య జొన్నలగడ్డ చిత్రంలో చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. శివాజీ రాజా, అనితా చౌదరి తమ పాత్రలకు న్యాయం చేస్తూ సినిమాకు బలం చేకూర్చారు. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం, పాటలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. నిర్మాతలు వేణు ఉడుగుల, రాహుల్ మొపిదేవి సినిమా నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తుంది . తెలంగాణలో సినిమా మొదటి వారం చివరినుంచి అసాధారణ రన్‌ను నమోదు చేస్తోంది. రిలీజ్ మూడు రోజుల్లోనే రూ. 7.28 కోట్ల వసూళ్లు సాధించి చిన్న సినిమా అయినప్పటికీ ప్రాఫిట్ జోన్లోకి చేరింది. కొన్ని చోట్ల టికెట్ ధరలు పెరగడం వంటి అంశాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల మౌత్ టాక్ కలెక్షన్లను మరింత పెంచుతున్నాయి.