Raju Gari Gadhi 4 | తెలుగు ప్రేక్షకుల్ని భయపెట్టిన హారర్ ఫ్రాంచైజీ ‘రాజు గారి గది’ ఇప్పుడు మళ్లీ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతోంది. యాంకర్-డైరెక్టర్ ఓంకార్ ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఈ సిరీస్‌లో నాలుగో భాగాన్ని ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు రాజు గారి గది 4: శ్రీచక్రం. తాజాగా విడుదలైన ఫస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కాళికా మాత ఉగ్రరూపంలో దర్శనం ఇవ్వగా, ఎర్రచీరలో ఉన్న ఓ మహిళ దేవీ వైపు నడుచుకుంటూ వెళ్తుండటం హారర్, మిస్టికల్ ఎలిమెంట్స్‌ను సూచిస్తోంది. పోస్టర్‌కు జత చేసిన “A Divine Horror Begins” ట్యాగ్ లైన్ ఆసక్తి రేపుతుంది.
ఈసారి కథా నేపథ్యం పూర్తిగా భక్తి, భయాల మిశ్రమంగా ఉండనుంది. ‘కాళికాపురం’ అనే ఊరిలోని కాళికా మాత ఆలయం, శ్రీచక్రం మహిమ, భక్తి వల్ల మేల్కొనే అమ్మవారు వంటి అంశాలతో హారర్, థ్రిల్లర్, కామెడీని మిక్స్ చేస్తూ ఓ కొత్త డైవైన్ యూనివర్స్‌ను నిర్మించనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. రాజు గారి గది హిట్ కావడంతో దానికి సీక్వెల్స్ చేస్తూ వస్తున్నారు ఓంకార్. ఇప్పటికే రాజు గారి గది2, రాజు గారి గది3 చిత్రాలు హిట్ కావడంతో రాజు గారి గది4 కు శ్రీకారం చుట్టారు. ‘రాజు గారి గది 4: శ్రీచక్రం’ సినిమా 2026 దసరా సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రారంభ దశలో ఉన్న స్క్రిప్ట్ వర్క్ పూర్తైన తర్వాత షూటింగ్ మొదలవుతుంది.
2015లో వచ్చిన ‘రాజు గారి గది’ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని నమోదు చేయగా, 2017లో ‘రాజు గారి గది 2’, 2019లో ‘రాజు గారి గది 3’ ప్రేక్షకులను అంతగా అలరించకలేకపోయాయి. అందుకే ఓంకార్ గ్యాప్ తీసుకుని మళ్లీ ఈ కొత్త కాన్సెప్ట్‌తో తిరిగి వస్తున్నారు. భక్తి, హారర్, థ్రిల్లర్ మేళవింపుతో ‘శ్రీచక్రం’ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. క్యాస్టింగ్‌కి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.