బాలీవుడ్లో ప్రయోగాత్మక, విలక్షణ కథా చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రాజ్‌కుమార్ రావు. తాజాగా ఆయన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్ బయోపిక్‌లో నటించబోతున్నారు. తొలుత ఈ బయోపిక్‌లో అమీర్‌ఖాన్ నటించడానికి ఆసక్తిని చూపించారు. ఆయన హీరోగా ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారయ్యింది. అనివార్య కారణాల వల్ల ఇటీవల అమీర్‌ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో రాజ్‌కుమార్ రావును మేకర్స్ సంప్రదించారు.
పబ్లిస్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నిఖమ్ ఎన్నో సంచలనాత్మక కేసులను టేకాఫ్ చేశారు. 1993 ముంబయి పేలుళ్లు, ముంబయిపై జరిగిన దాడి ఘటనలు, గుల్షన్ కుమార్ హత్యకేసుతో పాటు హైప్రొఫైల్ మర్డర్ కేసుల్లో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. భారత న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలకు గాను 2016లో పద్మపురస్కారం వరించింది. తాజాగా ఆయన బయోపిక్ తెరకెక్కబోతున్నది. ఈ సినిమా కోసం తాను ప్రత్యేకంగా సిద్ధం కాబోతున్నానని, ఉజ్వల్ నిఖమ్ వాదించిన కేసులను కూడా పరిశీలిస్తున్నానని రాజ్‌కుమార్ రావు తెలిపారు.