Rajkumar Hirani-Sharukh | భారత దేశంలో ఉన్న గొప్ప దర్శకులలో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. ఐఎమ్బిడి వరల్డ్ టాప్ 10 దర్శకులలో రాజ్‌కుమార్ రెండవ స్థానంలో ఉన్నాడంటే ఈయన ఎంత గొప్ప దర్శకుడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించింది కేవలం 5 సినిమాలు మాత్రమే. కానీ ఆ 5 సినిమాలు ఒక్కో జానర్లో ఉంటాయి. ఈ ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను సాధించాయి. అంతేకాకుండా ప్రతి సినిమాలో సందేశాన్ని పంచుతూ ఉంటాడు. కేవలం ఈయన కోసమే థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు. 2018లో వచ్చిన ‘సంజు’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి సినిమా రాలేదు. ఇక ఇటీవలే ఈయన షారూఖ్ ఖాన్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు.
రాజ్ కుమార్ హిరానీ ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి షారుఖ్‌తో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నించాడట. కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు రాజ్‌కుమార్, షారూఖ్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఈ చిత్రానికి డంకి అనే టైటిల్‌ను ఖారరు చేశారు. ఇక ఈ కాంబోపై ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్ర విడుదల తేదీను ప్రకటించాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.