రాజీవ్ కనకాల, షకలక శంకర్, శ్రీతేజ్, ఆక్సాఖాన్, రూపిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకుడు. ఎదవెల్లి వెంకట్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 15న సినిమా విడుదలకానుంది. ఈ సందర్బంగా విలేకరుల సమవేశం ఏర్పాటు చేశారు. ‘వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి జీవితాన్ని ప్రేరణగా తీసుకొని తయారు చేసుకున్న కథ ఇది. సమకాలీన సమస్యల నేపథ్యంలో సినిమా ఉంటుంది. ’ అని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరిందని, మంచి సినిమా తీశామనే తృప్తితో ఉన్నామని, త్వరలో ‘దళారి2’ కూడా చేస్తామని నిర్మాత తెలిపారు. అందరికీ నచ్చే మంచి కథతో ఈ సినిమా రూపొందిందని రాజీవ్ కనకాల చెప్పారు. ఈ సినిమాకు ైక్లెమాక్స్ హైలైట్‌గా నిలుస్తుందని షకలక శంకర్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మెంటం సత్యం.