Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్… ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఏడు పదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. రజనీకాంత్ సినిమాలకి మన దేశంలోనే కాదు విదేశాలలోను ఫుల్ క్రేజ్ ఉంటుంది. తలైవా సినిమా విడుదల అంటే ఫ్యాన్స్‌కి పండగే. ఆయన సినిమా కోసం థియేటర్స్ దగ్గర చేసే హంగామా మాములుగా ఉండదు. కొన్ని కంపెనీలు అయితే రజనీకాంత్ సినిమా రిలీజ్ రోజు సెలవులు కూడా ప్రకటిస్తాయి. ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రజనీకాంత్.
ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కూలీ, జైలర్ 2 సినిమాలు రూపొందుతున్నాయి. ఇందులో కూలీ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక జైలర్ 2 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రెండు సినిమాలను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోండగా, వాటిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రజనీకాంత్‌కి ఇటీవలి కాలంలో పెద్ద హిట్స్ రావడం లేదు. దీంతో ఆయన అభిమానులు ఇప్పుడు రజనీకాంత్ చేస్తున్న సినిమాలు రికార్డులు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ భార్యకి సంబంధించిన వార్త ఇప్పుడు ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది.
రజనీకాంత్ 1981లో లతా రజనీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సూపర్ స్టార్ నటుడిగా బిజీగా ఉన్న సమయంలో అతనిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఒక కాలేజీ అమ్మాయి లత. ఆ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఇప్పుటికీ ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక లతా రజనీకాంత్‌కి పాటలు పాడడం చాలా ఇష్టం. రజనీ నటించిన కోచ్చడయ్యాన్ సినిమాలో లతా రజనీకాంత్ పాట పాడారు. అలానే లతా రజినీకాంత్ ఒక సినిమాలో కూడా నటించారు, అది రజనీకి జోడీగా. ఈ విషయం చాలా మందికి తెలియదు. 1982లో విడుదలైన అగ్ని సాక్షి అనే సినిమాను కె.బాలచందర్ డైరెక్ట్ చేశారు. ఇందులో శివకుమార్, సరిత ప్రధాన పాత్రల్లో నటించారు. . ఈ చిత్రంలో రజనీ భార్యగా లత ఒక సీన్ లో మాత్రమే గెస్ట్ రోల్ లో కనిపించి అలరిస్తారు. ఈ ఒక్క తమిళ సినిమాలోనే లత నటించారు. ఆ తర్వాత ఇంకా ఏ చిత్రం ఆమె చేయలేదు.