Kannappa Promotions | మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు కథానాయకుడు మంచు విష్ణు. ఇందులో భాగంగానే సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఈ సినిమాలో మోహన్‌బాబు లాగానే మరో పవర్ఫుల్ పాత్రను తీసుకుందామనుకున్నాం. మొదట ఈ రోల్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్‌ని తీసుకోవాలని భావించినట్లు విష్ణు వెల్లడించారు. అయితే ఈ రోల్ కథకు సంబంధం లేకుండా ఎక్కువైపోతుందేమోనని చిత్రబృందం భావించడంతో ఆ పాత్రను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్‌ను ఎందుకు తీసుకున్నామన్నది సినిమా చూశాక ప్రేక్షకులకు అర్థమవుతుందని విష్ణు అన్నారు. ప్రభాస్‌కు రెండు పాత్రలను ఆఫర్ చేయగా.. అతడు రుద్ర రోల్‌పై ఆసక్తి చూపినట్లు విష్ణు వెల్లడించారు. అలాగే ప్రభాస్‌ను శివుడి పాత్ర కోసం అనుకోలేదని వచ్చిన ఊహాగానాలను కూడా విష్ణు ఖండించారు.
మరోవైపు ఈ సినిమాలోని ఒక పాటను సెన్సార్‌కు పంపించగా.. కన్నప్పలో లవ్‌స్టోరీ ఎక్కడ ఉందని సెన్సార్ సభ్యులు అడిగినట్లు విష్ణు తెలిపాడు. దీనికి సమాధానంగా.. కన్నప్పకు భార్య నీల ఉందని సమాధానమిచ్చినట్లు విష్ణు చెప్పుకోచ్చాడు.