పెద్దన్న 2 డేస్ కలెక్షన్స్.. రజినీకాంత్‌కు మరో ఫ్లాప్ తప్పేలా లేదే..?

Peddanna collections | ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వచ్చిందంటే చాలు సెలవులు ఇచ్చి మరీ చూడమని చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు సెలవులున్నా కూడా రజినీ సినిమా చూడ్డానికి రావడం లేదు ప్రేక్షకులు. సూపర్ స్టార్ ఇమేజ్ అలాగే ఉన్నా మార్కెట్ మాత్రం మునపటిలా లేదనేది కాదనలేని వాస్తవం. పెద్దన్న సినిమా విషయంలో మరోసారి అది ప్రూవ్ అవుతుంది. శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజినీకాంత్, కీర్తి సురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ నటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా ఈ సినిమాకు ఊహించిన కలెక్షన్స్ రావడం లేదు. ఏపీ, తెలంగాణలో అయితే రజినీ గత సినిమాల కంటే దారుణంగా ఓపెనింగ్స్ వచ్చాయి. మరి అవేంటి.. ఇంకా ఎంత దూరం వెళ్లాలనేది చూద్దాం..
నైజాం: 0.79 కోట్లు
సీడెడ్: 0.36 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.23 కోట్లు
ఈస్ట్: 0.16 కోట్లు
వెస్ట్: 0.12 కోట్లు
గుంటూరు: 0.29 కోట్లు
కృష్ణా: 0.15 కోట్లు
నెల్లూరు: 0.13 కోట్లు
ఏపీ + తెలంగాణ: 2.23 కోట్లు షేర్
ఈ సినిమాను తెలుగులో రూ.12 కోట్లకు అమ్మారు. అంటే రూ.13 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీకెండ్ క్యాష్ చేసుకుంటే కానీ రజినీకాంత్ సినిమా కాస్తో కూస్తో బయటపడదు. అయినా కూడా రూ.13 కోట్లు వసూలు చేయడం అనేది దాదాపు అసాధ్యంలా కనిపిస్తుంది. ఒకప్పుడు రజినీ సినిమాకు కేవలం రెండు రోజుల్లో వచ్చే వసూళ్లు ఇవి. కానీ ఇప్పుడు ఆ మార్కెట్ కనిపించడం లేదు. దాంతో రజినీకాంత్‌కు మరో ఫ్లాప్ తప్పేలా కనిపించడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
లవ్ స్టోరీ ఫైనల్ కలెక్షన్స్.. క్లిష్ట పరిస్థితుల్లో హిట్ కొట్టిన చైతూ..
Pushpa : హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Bheemla Nayak : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న పవన్.. ఫిబ్రవరిలో సందడి చేసేందుకు సిద్ధం
Fun bucket bhargav : బెయిల్‌పై విడుదలైన ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ జైలుకే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

