Rajinikanth | శుక్రవారం చెన్నైలో జరిగిన ‘జైలర్’ చిత్ర ఆడియో వేడుకలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మద్యపానం అలవాటుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తనకు ఆల్కహాల్ అలవాటు కాకుంటే సమాజానికి మరింతగా సేవ చేసే అవకాశం దొరికేదని పేర్కొన్నారు. ‘నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు మద్యపానానికి అలవాటు కావడమే. అయితే మీరు పూర్తిగా మద్యాన్ని మానేయాలని నేను చెప్పడం లేదు. కొన్ని సంతోష సందర్భాల్లో పరిమితిలో తాగండి.
నిత్యం మద్యాన్ని సేవించడం మాత్రం మన ఆరోగ్యానికి, ఆనందానికి ప్రమాదకరం’ అని రజనీకాంత్ అభిమానులను సలహా ఇచ్చారు.ఈ సినిమాలోని ఓ పాటలో సూపర్‌స్టార్ అనే పదాన్ని ఉపయోగించడంపై రజనీకాంత్ స్పందించారు. తనకు సూపర్‌స్టార్ అనే బిరుదు అస్సలు ఇష్టం ఉండదని, పాటలో ఆ పదాన్ని తీసివేయాలని దర్శకుడికి సూచించానని తెలిపారు. ‘జైలర్’ చిత్రం ఆగస్ట్ 10న విడుదల కానుంది.