Rajinikanth | సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడే కనిపించే అద్భుత కాంబినేషన్లలో ఒకటిగా ‘జైలర్ 2’ నిలవబోతోంది. ఒకే సినిమాలో నలుగురు సూపర్ స్టార్స్ కలిసి నటించబోతున్నారన్న వార్త సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే ఘన విజయాన్ని అందుకున్న జైలర్‌కి సీక్వెల్‌గా రూపొందుతోంది. మొదటి భాగంలో రజనీకాంత్ నటనతో పాటు శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్ర సినిమాకు అదనపు హైప్ తెచ్చింది. ఈ సీక్వెల్లో రజనీకాంత్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ , కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కలిసి కనిపించనున్నట్లు సమాచారం. ఈ స్థాయి కాంబినేషన్ ఒకే సినిమాలో రావడం చాలా అరుదు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని, ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మోహన్‌లాల్‌పై కూడా కీలక సీన్స్ పూర్తి చేశారు. ‘జైలర్ 2’ను హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. నలుగురు సూపర్ స్టార్స్ ఉండటంతో భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
‘జైలర్’ విజయంతో ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నలుగురు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాను 2026 ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మెగా మల్టీస్టారర్‌తో మరోసారి రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తారనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. , ‘జైలర్ 2’ కేవలం సినిమా మాత్రమే కాదు… ఇండియన్ సినిమాకు మరో కొత్త స్థాయి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా నిలవనుంది.