Kanguva | తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మాట్లో సందడి చేయనుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్టర్లు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ మూవీ కోసం హిందీలో వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు సూర్య. అయితే ఈ నేపథ్యంలోనే యాంకర్ సూర్యను సూపర్ స్టార్ అని పిలువగా.. సూర్య సమాధానమిస్తూ.. సూపర్ స్టార్ అంటే మాకు ఎప్పటికి రజనీ సర్ మాత్రమే. రజనీకాంత్ మాత్రమే ఒక్కడే సూపర్ స్టార్ అతడి తర్వాత సూపర్ స్టార్లు అంటూ లేరు అంటూ సూర్య చెప్పుకోచ్చాడు.
Anchor called #Suriya as Superstar at #Kanguva envent !!
Suriya’s reply: Superstar is always #Rajinikath sir. There is always one Superstar. You cannot take away one person’s name and batch on other👌❤️pic.twitter.com/3flS8B6lIt
— AmuthaBharathi (@CinemaWithAB) October 23, 2024