Coolie movie | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కూలీ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా.. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడంతో పాటు టికెట్లు కూడా బుక్ చేస్తున్నాయి. అయితే తాజాగా తమ అభిమాన హీరో సినిమా హిట్టు అవ్వాలని తమిళనాడు తిరుచిరాపల్లిలోని పిళ్ళయార్ (గణేష్) టెంపుల్లో రజనీ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను సన్ పిక్చర్స్ నిర్మించగా.. ఇందులో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
#WATCH | Tamil Nadu | Fans of superstar Rajinikanth offered special prayers at Vinayagar Temple in Tiruchirappalli, for the success of his upcoming film ‘Coolie’. pic.twitter.com/GfLFsCwKmb
— ANI (@ANI) August 13, 2025