Coolie Shoot Wrap Up | తలైవా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తలైవ కెరీర్లో ఇది 171వ సినిమా ఇది. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అగ్ర నటులు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ జోడీ కడుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
గోల్డ్ స్మగ్లింగ్‌కు సంబంధించిన కథాంశంగా ఈ చిత్రం రూపొందుతుండగా ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకుంది చిత్రబృందం. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సన్ పిక్చర్స్ స్పెషల్ వీడియోను విడుదల చేసింది.