సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న పాపులారిటీ గురించి అందరికి తెలిసిందే. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’ని వంద దేశాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో పేరు పొందిన హంసిని ఎంటైర్టెన్మెంట్స్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనుందని సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ దళపతి విజయ్ ‘గోట్’ చిత్రాన్ని 40 దేశాల్లో, ఎన్టీఆర్ ‘దేవర’ను 90 దేశాల్లో రిలీజ్ చేసింది. ‘కూలీ’తో తొలిసారి వందకుపైగా దేశాల్లో రిలీజ్‌ను లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘కూలీ’ చిత్రంలో తెలుగు అగ్ర నటుడు నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నారు. అమీర్‌ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి అగ్రతారలు భాగమవడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.