సూపర్‌స్టార్ రజనీ కాంత్ 173వ చిత్రానికి దర్శకుడు ఖరారయ్యారు. యువ దర్శకుడు శిబి చక్రవర్తి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. అగ్ర నటుడు కమల్‌హాసన్ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడిని ప్రకటిస్తూ మేకర్స్ శనివారం సోషల్‌మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు. తమ నిర్మాణ సంస్థ పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపజేసేలా ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించబోతున్నామని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్రబృందం వెల్లడించింది.
దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందించబోతున్నారు. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. గతంలో ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటన చేశారు. అనివార్య కారణాల వల్ల ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ అవకాశం శిబి చక్రవర్తిని వరించింది. 2022లో వచ్చిన ‘డాన్’ చిత్రంతో శిబిచక్రవర్తి దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.