సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పాంచాలి పంచభర్తృక’. గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట’ అనే పాటకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..ఈ మధ్యకాలంలో తాను ఇటువంటి పాత్రను చేయలేదని, ఇందులో తాను ఫైట్లు కూడా చేశానని, మునుపటి రాజేంద్రప్రసాద్‌ను చూస్తారని అన్నారు.
ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిదని, ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు ఎంటర్టైన్ చేస్తుందని మేకర్స్ చెప్పారు. జెమినీ సురేష్, రోల్ రైడా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహేష్ నారాయణ, బిషేక్, రోల్‌రైడా, కథ: బాబీ కె ఎస్ ఆర్, మాటలు, దర్శకత్వం: గంగ సప్తశిఖర.