Rajeev- Suma| టెలివిజన్ ఇండస్ట్రీలోనే కాదు సినీ పరిశ్రమలో కూడా సుమ-రాజీవ్ కనకాల జంటకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సుమ తన యాంకరింగ్‌తో అదరగొడుతుంటే, రాజీవ్ కనకాల నటుడిగా రాణిస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే యాంకర్ సుమ-రాజీవ్ కనకాల విడిపోతున్నారు.. విడాకులు తీసుకుంటున్నారనే రూమర్లు ఒకప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. దీనిపై ఓ సారి రాజీవ్ కనకాల స్పందిస్తూ చాలా బాధ పడ్డారు. ఇలాంటి రూమర్స్.. మా అమ్మ నాన్నలు బతికి ఉన్నప్పుడు వచ్చి ఉంటే.. ఎంత బాధగా ఉండేది. వాళ్లు పోయారు కాబట్టి పర్లేదు. కానీ మాకంటూ ఫ్యామిలీ ఉంది కదా.. బాబాయ్‌లు పిన్నిలూ మిగిలిన బంధువులంతా ఊర్లలో ఉన్నారు.
వాళ్లకి ఇలాంటి వార్తలు తెలిసినప్పుడు.. ఎందుకు మాకు చెప్పలేదు అని కంగారు పడి ఫోన్ చేస్తున్నారు. ఏం కాలేదు అని చెప్పడానికి చాలా ఇబ్బందిగా అనిపించి అని రాజీవ్ కనకాల ఓ సందర్భంలో నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ మధ్య కాలంలో సుమ-రాజీవ్ కూడా అన్యోన్యంగా కలిసి కనిపించింది లేదు. అయితే ఆహా ఓటీటీలో సరికొత్త షో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K ఇటీవల మొదలు కాగా, ఇందులో పలువురు సెలబ్రిటీలకు వంటల పోటీలు పెట్టి సుమ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ షో రెండో ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు.
ఈ ఎపిసోడ్ లో సెలబ్రిటీలకు పూతరేకులు తయారుచేయాలని సుమ చెబుతుంది. ఈ పూతరేకులు తయారుచేసే క్రమంలో సెలబ్రిటీలు ఫుల్ గా నవ్వించారు. ఇక ఈ ఎపిసోడ్ కి సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల గెస్ట్ గా వచ్చారు. సుమ – రాజీవ్ ల 26వ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇందులో ఇద్దరు చాలా ఆప్యాయంగా కనిపించారు. ఈ జంట క్యూట్ గా తన ప్రేమతో అలరించింది. ఇది చూసిన వారంతా ఈ జంట నిండు నూరేళ్లు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.