Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
Rajeev Kanakala | యాంకర్ సుమ కనకాల అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టీవీ కార్యక్రమాలు, సినిమా వేడుకలు, యూట్యూబ్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే ఆమె.. మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా కూడా తన మంచి మనసును చాటుకుంటున్నారు.
Rajeev Kanakala | యాంకర్ సుమ కనకాల అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టీవీ కార్యక్రమాలు, సినిమా వేడుకలు, యూట్యూబ్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే ఆమె.. మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా కూడా తన మంచి మనసును చాటుకుంటున్నారు. పండగలను అందరిలా జరుపుకోలేని అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సుమ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమానికి సంబంధించిన వేడుకలో ఆమె భర్త, నటుడు రాజీవ్ కనకాల భావోద్వేగానికి గురయ్యారు. భార్య గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో సుమ కూడా ఎమోషనల్ అయ్యారు.
సుమ కనకాల ‘ఫెస్టివల్ ఫర్ జాయిస్’ అనే సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల ఆశ్రమాల్లో ఉంటూ పండగలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే అవకాశం లేని వారికి సంతోషాన్ని పంచడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. పండగల సమయంలో వారికి అవసరమైన సహాయం అందిస్తూ, వారిలోనూ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు సుమ కృషి చేస్తున్నారు. ఈ సంస్థ ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమ భర్త రాజీవ్ కనకాల ఆమె సేవా ప్రయాణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
సుమ ప్రయాణం సాధారణమైనది కాదని రాజీవ్ కనకాల అన్నారు. వృత్తిపరమైన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆమె పట్టుదల ఎంతో గొప్పదని ప్రశంసించారు. తనలాంటి వ్యక్తిని భరిస్తూ కూడా ఆమె ఇన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారని సరదాగా అన్నారు. ఇక ‘ఫెస్టివల్ ఫర్ జాయిస్’ సంస్థను ఐదేళ్ల క్రితం అధికారికంగా ప్రారంభించినప్పటికీ, అంతకుముందు నుంచే సుమ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని రాజీవ్ వెల్లడించారు. తమ వివాహమైన రెండుమూడేళ్ల నుంచే ఆమె ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించారని తెలిపారు. చాలా సందర్భాల్లో ఎవరికీ తెలియకుండా గుప్తదానాలు కూడా చేశారని చెప్పారు.పండగలు జరుపుకోలేని వారు కూడా తమలాగే ఆనందంగా పండగలు చేసుకోవాలనే ఆలోచనతోనే సుమ ఈ సంస్థను ప్రారంభించారని రాజీవ్ వివరించారు.
ఈ సేవా కార్యక్రమాల వెనుక కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, తాము సుమకు పెద్దగా సహాయం చేయలేదని రాజీవ్ అన్నారు. తమతో పాటు తన చుట్టూ ఉన్నవారికి కూడా సుమే అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇతరుల కోసం ఆమె పడే తపన, సేవ చేయాలనే సంకల్పం తనను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పారు. సుమ ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ 116 ఏళ్లు జీవించాలని ఆకాంక్షించారు. తన ప్రసంగం చివర్లో ‘లవ్ యూ’ అంటూ భార్యపై తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ మాటలు చెబుతున్న సమయంలో రాజీవ్ భావోద్వేగానికి గురయ్యారు. భర్త తన గురించి, తన సేవా కార్యక్రమాల గురించి ఎంతో ప్రేమగా మాట్లాడటంతో సుమ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజీవ్ ప్రసంగం పూర్తయ్యాక ఆమె వేదికపైకి వెళ్లి ఆయనను దగ్గరకు తీసుకొచ్చారు. భార్యాభర్తల మధ్య కనిపించిన ఈ భావోద్వేగ క్షణాలు కార్యక్రమానికి హాజరైనవారిని కదిలించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక విడాకులు తీసుకుంటున్నారా.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్..!
Hyderabad | హైదరాబాద్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో షాక్.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

