సుమతో అందుకే విడిగా ఉండాల్సి వచ్చింది: రాజీవ్ కనకాల
తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాలకు ఉన్న డిమాండ్ వేరు. వయస్సు 50కి దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ ఈమె స్టార్ యాంకర్.. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ యాంకర్.

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాలకు ఉన్న డిమాండ్ వేరు. వయస్సు 50కి దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ ఈమె స్టార్ యాంకర్.. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ యాంకర్. ఈమెకు పోటీ ఎవరు లేరు.. ఇక రారు కూడా. ఎంతో మంది యంగ్ యాంకర్స్ అందాలు ఆరబోస్తున్న కూడా సుమకు మాత్రం సాటి రావడం లేదు. యాంకరింగ్ కు చీర కట్టినా.. లంగా ఓణీ వేసిన అది అచ్చం సుమ కనకాల మాదిరే ఉంటుంది. సుమ గురించి ఏ విషయం అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తుంటారు. రెండు సంవత్సరాల క్రింద సుమ రాజీవ్ కనకాల విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చాలా వచ్చాయి.
ఇద్దరూ వేరువేరు ఇళ్లలో ఉండడంతో అది నిజమే అని అందరూ నమ్మారు కూడా. అయితే కొన్ని రోజుల తర్వాత ఇద్దరు మీడియా ముందుకు వచ్చి.. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. పచ్చని కాపురంలో నిప్పులు పోయడం ఎవరికీ మంచిది కాదు అంటూ సీరియస్ అయ్యారు. వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమాలో అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలు కూడా చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. ఈ క్రమంలోనే తాను ఎందుకు సుమతో విడిగా ఉండాల్సి వచ్చింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. నిజానికి 2018 వరకు అందరం కలిసే ఉన్నామని.. అయితే అదే సమయంలో తన అమ్మ చనిపోవడంతో నాన్న ఒక్కడే మణికొండలోని తమ సొంత ఇంట్లో ఉండిపోయాడు అని చెప్పాడు రాజీవ్.
ఆ సమయంలో నాన్న దేవదాస్ కనకాల కోసం తాను కూడా మణికొండకు షిఫ్ట్ అయ్యానని.. అప్పుడు సుమతో విడిగా ఉండాల్సి వచ్చింది అని చెప్పాడు. తాను ఉంటున్న ఫ్లాట్ కి నాన్నను తీసుకొద్దాం అనుకుంటే.. ఆయన బుక్ లైబ్రరీ చాలా పెద్దగా ఉందని.. అది తమ ఇంట్లో పట్టకపోవడంతో నాన్నతో పాటు అక్కడే ఉండిపోయాను అంటున్నాడు రాజీవ్ కనకాల. దాంతో సుమ, రాజీవ్ విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చేశాయ్ అని చెప్పాడు ఈ సీనియర్ నటుడు. ప్రస్తుతం అందరం కలిసే ఉంటున్నాం అంటున్నాడు రాజీవ్ కనకాల.
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

