Ravikiran Kola | ఇటీవలే కింగ్డమ్తో హిట్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్‌తో ఒక పీరియాడికల్ సినిమా చేస్తుండగా.. ఈ సినిమా అనంతరం దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నాడు. SVC59 అంటూ వస్తున్న ఈ సినిమాకు రాజావారు రాణిగారు (RajaVaaru RaniGaaru) ఫేమ్ రవికిరణ్ కోలా (Ravikiran Kola) దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. గోదారి బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రానుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్‌తో పాటు స్టార్ నటి కీర్తి సురేష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.