Sekhar | రాజశేఖర్ ఎదురుచూపులు.. పర్ఫెక్ట్ డేట్ కోసం చూస్తున్న శేఖర్
Sekhar Movie | ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు విడుదల తేదీలను కన్ఫార్మ్ చేసుకున్నాయి. భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదల తేదీలను బుక్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమాకు కూడా మంచి రిలీజ్ డేట్ దొరికింది. దీంతో ఇప్పుడు మరో సీనియర్ హీరో కూడా తన సినిమాకు మంచి డేట్ సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఆయన ఎవరో కాదు రాజశేఖర్. ఈయన నటించిన శేఖర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు అయిపోయింది. కానీ సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు. మార్చి వస్తే మళ్లీ భారీ సినిమాలు రానున్నాయి. దాంతో ఫిబ్రవరిలోనే మంచి తేదీ ఎంచుకోవాలని చూస్తున్నాడు ఈ సీనియర్ హీరో.
వరుస ఫ్లాపులతో సతమతమైన రాజశేఖర్.. గరుడ వేగ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కల్కి కూడా మంచి టాక్ తెచ్చుకుంది. 2019లో వచ్చిన ఈ సినిమా తర్వాత రాజశేఖర్ నుంచి మరో సినిమా రాలేదు. చాలారోజుల తర్వాత ఇప్పుడు ఈయన నుంచి శేఖర్ సినిమా వస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి అప్లాజ్ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజశేఖర్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి పండక్కి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రిలీజ్ కుదరలేదు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు తమ సినిమాల విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో రాజశేఖర్ కూడా మరో మంచి డేట్ చూసుకుని సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు.
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఓ సినిమాకు రీమేక్‌గా శేఖర్ సినిమా వస్తుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను జీవిత రాజశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ముందు ఈ సినిమాకు మరో దర్శకుడు ఉన్నా కూడా మధ్యలో ఆయన తప్పుకోవడంతో.. జీవిత టేకోవర్ చేసింది. ఇది రాజశేఖర్‌కు 92వ సినిమా కావడం గమనార్హం.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
కెరీర్లో దూసుకెళ్తున్న టైంలో లతా మంగేష్కర్‌పై విషప్రయోగం.. చేసింది ఎవరో..
Sonia Akula | ఆర్జీవీ మాటలతో నాపై నమ్మకం పెరిగింది.. ఆశా ఎన్కౌంటర్ హీరోయిన్
1950ల్లో ఒక్కో పాటకు లతాజీ ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

