Lubber Pandhu | టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తమిళంలో విజయం సాధించిన ‘లబ్బర్ పందు’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా తెరపై కనిపించని రాజశేఖర్ ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం. క్రికెట్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా నచ్చడంతో రాజశేఖర్ రీమేక్ హక్కులు కొనుగోలు చేశారని సమాచారం. ఇందులో రాజశేఖర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. 35 ఫేమ్ విశ్వ ఈ సినిమాలో హీరోగా నటించబోతుండగా.. రాజశేఖర్ కూతురు ఇందులో కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం.