Ashish Chanchlani | టాలీవుడ్ ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్ (SSMB29) టైటిల్ రివీల్ ఈవెంట్‌కు సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి, మహేష్ బాబుల కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ‘గ్లోబ్ ట్రాటర్’ (Globe Trotter) అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. అయితే ఈ మూవీ టైటిల్ రివీల్ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతుండగా.. ఈ వేడుకకు హోస్ట్‌గా తెలుగు నుంచి యాంకర్ సుమతో పాటు హిందీ నుంచి ప్రముఖ ఇండియన్ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ ఆశీశ్ చంచ్లానీ (Ashish Chanchlani) హోస్ట్‌గా వ్యవహారించబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఇందులో రాజమౌళి ఈవెంట్‌కి సంబంధించిన విషయాలను చిత్రబృందంతో పాటు హోస్ట్‌లు సుమకి, ఆశీశ్ చంచ్లానీకి వివరిస్తుండటం చూడవచ్చు.
యూట్యూబ్‌లో కోట్లాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఆశీశ్ చంచ్లానీ, తన కామెడీ స్కిట్స్ మరియు వీడియోలతో దేశవ్యాప్తంగా యువతలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అయితే ఆశీశ్ ఈ వేడుకకు హోస్ట్‌గా వ్యవహారించబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు పాన్-ఇండియా, గ్లోబల్ స్థాయి ప్రేక్షకులను ఆకర్షించే లక్ష్యంతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న యూట్యూబర్ ఆశీశ్ను ఈ ఈవెంట్‌కు ఎంచుకున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Globetrotter
Ashish Chanchlani officially confirms about #GlobeTrotter event via Instagram 🤩🔥 pic.twitter.com/N141fBN3Vz
— 🐋 (@_BhaagSaale_) November 13, 2025