Rajamouli | సినిమాలతో పాటు క్రికెట్ గురించి కూడా రాజమౌళి పలు సందర్భాలో ప్రస్తావిస్తూ ఉంటారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సమయంలో, టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత కూడా టీమిండియాను అభినందిస్తూ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా రేపు జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనుండగా, ఈ మ్యాచ్‌పై రాజమౌళి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ రెండు జట్లు ఒక్కసారి కూడా ఐపీఎల్ చరిత్రలో ట్రోఫీని అందుకోలేదు. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా అది చరిత్రే అవుతుంది. అయితే ఇవి రెండు రాజమౌళికి ఫేవరేట్ కాగా, ఫైనల్ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా హార్ట్ బ్రేక్ అవ్వడం మాత్రం తప్పదని అన్నాడు.
రాజమౌళి తన ట్వీట్లో.. ‘‘బుమ్రా, బౌల్ట్ వేసిన యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించిన తీరు అత్యద్భుతం అని కొనియాడారు రాజమౌళి . ఢిల్లీని ఫైనల్‌కి తీసుకువెళ్లిన అయ్యర్, ఆ తర్వాత కోల్ కతాకు కప్ అందించాడు..అయినా కూడా అతనిని వదులుకున్నారు. ఇక పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్ ను ఫైనల్ కు చేర్చాడు.ఈ ఏడాది కూడా ట్రోఫీ అందుకోవడానికి శ్రేయాస్ అర్హుడు” అంటూ రాజమౌళి పోస్ట్ చేశాడు.మరోవైపు విరాట్ కోహ్లీపై కూడా ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్లో ప్రతి సంవత్సరం తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ.. వేల పరుగులను పూర్తి చేసిన కోహ్లికి కూడా ఐపీఎల్ ట్రోఫీ దక్కాలని రాజమౌళి కోరాడు. ఈ ఏడాది కప్ కొట్టేందుకు కోహ్లీ కూడా అర్హుడే అని చెప్పాడు
అయితే ఫలితం ఎలా ఉన్నా హార్ట్ బ్రేక్ అవ్వడం మాత్రం తప్పదంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే మహేష్ బాబు షూటింగ్‌తో బిజీబిజీగా గడుపుతున్న రాజమౌళి ఐపీఎల్ మ్యాచ్ చూడడమే కాకుండా విశ్లేషించడంతో ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ చేశాడు. మీకు ఇంత టైమెక్కడిది సామీ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. ఇక తన ప్రతి సినిమాతో ఇండియా స్థాయిని పెంచిన రాజమౌళి ఈ సారి మహేష్ బాబు సినిమాతో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.