దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాని త్వరలోనే విడుదల చేయనుండగా, ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత రాజమౌళి..మహేష్‌తో ఓ సినిమా చేయనుండగా, దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చింది. తాజాగా చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి హల్ చల్ చేస్తుంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం మహేష్ కోసం రాజమౌళి ..సమంతను రంగంలోకి దింపుతున్నాడట. నిజానికి రాజమౌళి తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడు. ఒక్క అనుష్కతోనే రాజమౌళి మూడు సినిమాలు చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు, బాహుబలి చిత్రాలలో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఇక గతంలో రాజమౌళి చేసిన ‘ఈగ’ సినిమాలో సామ్ కన్పించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సమంతని మహేష్‌తో చేయబోయే మూవీలో తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని టాక్. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంతకు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ వచ్చింది. దీంతో ఆమె అయితే బాగుంటుంది అని జక్కన్న ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం.