‘జేమ్స్‌బాండ్ సినిమాల స్ఫూర్తితో ‘రా’ ఏజెంట్‌గా ఉద్యోగాన్ని చేపట్టిన విక్రమ్‌కు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు కార్తికేయ. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. 88రామారెడ్డి నిర్మాత. శ్రీ సరిపల్లి దర్శకుడు. తాన్యా రవిచంద్రన్ కథానాయిక. నవంబర్ 12న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘యాక్షన్, వినోదం అంశాల కలబోతగా సాగే చిత్రమిది. ఎన్ఐఏ ఏజెంట్ విక్రమ్‌గా కార్తికేయ పాత్రచిత్రణ, లుక్ కొత్తగా ఉంటాయి. వృత్తి నిర్వహణలో అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది’ అని తెలిపారు. ‘కమర్షియల్ హంగులతో పాటు కొత్తదనం ఉన్న చిత్రమిది. నటుడిగా కార్తికేయను నవ్యరీతిలో ఆవిష్కరిస్తుంది. త్వరలో సెన్సార్‌కు వెళ్లనున్నాం’ అని నిర్మాత చెప్పారు. సుధాకర్కోమాకుల, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.