న్యూఢిల్లీ : జనన-మరణాల నమోదు చట్టం-2026 గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో జనన, మరణాల రిజిస్ట్రేషన్ల ఆలస్యంపై నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ఇక నుంచి వ్యక్తి జన్మించిన లేదా మరణించిన ఏడాది తర్వాత రెండేండ్ల లోపు సమాచారం ఇస్తే.. జిల్లా మెజిస్ట్రేట్ లేదా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ లేదంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారం ఉన్న అధికారి తనిఖీ చేసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత సంబంధిత రుసుము చెల్లించాక నమోదు చేస్తారు.. ఒకవేళ రెండేండ్లు దాటిన తర్వాత సమాచారం ఇస్తే ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల చట్టం 1969లోని 13(3)ను మార్చడంతో పాటు కొత్తగా సెక్షన్ 13(3ఏ)ను చేర్చారు.