‘బ్యాచ్‌లర్‌గా నేను చేసిన ఆఖరి సినిమా ఇది. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి జీవితంలో కొత్త అడుగు వేయాలని కోరుకుంటున్నా. తప్పకుండా ఆ కల నెరవేరుతుందనే నమ్మకముంది’ అని అన్నారు కార్తికేయ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. 88రామారెడ్డి నిర్మాత. శ్రీసరిపల్లి దర్శకుడు. తాన్యారవిచంద్రన్ కథానాయిక. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను హీరో వరుణ్‌తేజ్ విడుదలచేశారు. కార్తికేయ మాట్లాడుతూ “ఆర్ఎక్స్100’ తర్వాత నేను అంగీకరించిన చిత్రమిది. చిరంజీవికి నేను వీరాభిమానిని. ఆయన టైటిల్‌తో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు. నవ్విస్తూనే ఉత్కంఠను పంచే చిత్రమిదని సీనియర్నటుడు సాయికుమార్ పేర్కొన్నారు. ‘హాలీవుడ్ శైలిలో సాగే న్యూఏజ్ కమర్షియల్ సినిమా ఇది. ఇందులో నేను ఓ ప్రత్యేక పాత్రను పోషించాను. కార్తికేయకు యాక్షన్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది’ అని సుధాకర్కోమాకుల చెప్పారు. ఈ సినిమాపై కార్తికేయ పెట్టుకున్న అంచనాలు వందశాతం నిజమవుతాయనే నమ్మకముందని దర్శకుడు తెలిపారు.