Raja Saab | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి దాదాపు అరడజను చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. వాటిలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రం ఒకటి. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో డిసెంబర్ 5 థియేటర్లకు రాబోతోందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ముందు డిసెంబర్ 12 అనే ప్రచారం జోరుగా జరిగాయి. కాని పుష్ప 2 ది రూల్ తేదీని తీసుకుని తెలివైన ఎత్తుగడ వేశారు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సంక్రాంతి వరకు ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. లాంగ్ రన్లో 1500 కోట్లను దాటించవచ్చని ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది.
రాజా సాబ్ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. అప్పుడెప్పుడో ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్, విడుదల తేదీని కూడా ప్రకటించారు. టీజర్‌ను జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వలన షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇంకా చివరి దశ షూటింగ్‌లోనే ఉండి పోయింది. ఫ్యాన్స్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వండి అంటూ పదే పదే ఒత్తిడి తేవడంతో మేకర్స్ ఎట్టకేలకు ఈ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు.
సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్, రిద్ది కుమార్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హార్రర్ కామెడీ జోనర్లో ఈ చిత్రం రూపుదిద్దుకుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన అప్డేట్ న్యూస్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తీసుకు వచ్చి హంగామా సృష్టిస్తున్నారు