Raja Saab | ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్ర రిలీజ్‌పై అందరిలో అనేక సందేహాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న చిత్రం విడుదల కానుందని ముందుగా ప్రకటించగా, తాజా పరిణామాలు చూస్తుంటే రిలీజ్ తేదీ మారబోతున్న సూచనలు స్పష్టంగా ఉన్నాయి. హీరోయిన్ మాళవిక మోహనన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో విడుదల తేదీ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం, ఆమె చేసిన పోస్ట్‌లో రిలీజ్ డేట్‌కు సంబంధించి హింట్ కూడా ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, ‘ది రాజా సాబ్’ విడుదలను జనవరి 9, 2026కి మారుస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి సమయంలో రిలీజ్ అయితే బాక్సాఫీస్ వసూళ్ల పరంగా డబుల్ బెనిఫిట్ ఉంటుందని భావిస్తున్నారట.
తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రాజా సాబ్ సంక్రాంతికి వస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. తెలుగు బిజినెస్ సర్కిల్ వారు కూడా జనవరి 9న విడుదల చేయాలని అంటున్నారు. హిందీ ఆడియన్స్ మాత్రం డిసెంబర్ 5నే విడుదల చేయాలంటున్నారు. ఆ సమయంలో అక్కడ పెద్ద చిత్రాలు విడుదల కావడం లేదని, ఏడాది చివర్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని అంటున్నారని నిర్మాత పేర్కొన్నాడు. రాజా సాబ్ అక్టోబర్ చివరికి షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటుందట. పాటలు మాత్రమే మిగిలాయట. సినిమా దాదాపు 4.30గంటల నిడివి రాగా, దాని ఎడిట్ చేయాల్సి ఉంది. రాజా సాబ్ 2 కూడా ఉంటుందని నిర్మాత స్పష్టం చేశారు.
అయితే డిసెంబర్ 5 స్లాట్ ఖాళీ అయితే ఈ డేట్ లో బాలయ్య సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా “అఖండ 2” వస్తుందనే బజ్ కూడా చాలా రోజులు నుంచి ఉంది. సో దీనిపై కూడా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇది వరకు పార్ట్ 1 కూడా డిసెంబర్ మొదటి వారంలోనే వచ్చి ఘన విజయం సాధించడంతో ఇప్పుడు అఖండ 2 చిత్రాన్ని కూడా డిసెంబర్లోనే తీసుకొస్తారనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది.