Raja Saab | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్గా కన్నప్ప చిత్రంతో పలకరించాడు. ఇందులో రుద్రగా ఉన్న కొంచెం సేపు అయిన తెగ సందడి చేశాడు. ఇక ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంకి సంబంధించి ఇటీవల గ్లింప్స్ విడుదల కాగా, ఇది మూవీపై భారీ అంచనాలు పెంచింది. రాజా సాబ్ థ్రిల్లర్ మాత్రమే కాదు ఫుల్ ఎంటర్టైన్ కూడా అందించేలా ఉంది.. సినిమాలో ప్రభాస్ కామెడీ పంచుతూనే అవసరమైన టైం లో హీరోయిజం చూపిస్తాడని చెప్పుకుంటున్నారు. డిసెంబర్ లో రాజా సాబ్ రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్ ఆ నెక్స్ట్ హను రాఘవపుడితో చేస్తున్న ఫౌజీని కూడా 2026 సమ్మర్ కి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
రాజాసాబ్ చిత్రాన్ని డిసెంబర్ 5, 2025 నాటికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. రీసెంట్గా విడుదలైన టీజర్లో ప్రభాస్ రెండు విభిన్న లుక్స్‌తో, కామెడీ, హీరోయిజం రెండు చూపించి అంచనాలు రెట్టింపు చేశాడు. మారుతి ప్రభాస్‌తో ఏదో అద్భుతం చేస్తున్నాడు అని ముచ్చటించుకుంటున్నారు. ఇందులో మాళవిక మోహన్, నిధి అగర్వాల్,రిద్ధి కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తన మ్యూజిక్‌తో సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళతాడని ముచ్చటించుకుంటున్నారు.
రెండు సంవత్సరాల పాటు చిత్రీకరణ జరిగిన టీజర్ కూడా విడుదల చేయలేదంటూ ట్రోల్స్ చేశారు. కానీ ఇటీవల విడుదలైన గ్లింప్స్ చూసిన వెంటనే ఫ్యాన్స్ ఉత్సాహం ఎల్లలు దాటింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జూలై మొదటి వారంలో రాజా సాబ్ చివరి షెడ్యూల్ ప్లాన్ చేశారట. హైదరాబాద్‌లో నిర్మించిన ప్యాలెస్ సెట్లో షూటింగ్ జరగనుందని, ఈ షెడ్యూల్లో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నాడని అంటున్నారు. ఇప్పుడు క్లైమాక్స్ షూట్ చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వీలైనంత వేగంగా ఫినిష్ చేయాలనే కసితో మారుతి అండ్ టీం ఉంది. వరుస హిట్స్ తో మంచి జోష్ మీదున్న ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి అందుకుంటాడో చూడాలి.