Box office | రాజ రాజ చోర కలెక్షన్ల పరిస్థితేంటి?
రాజ రాజ చోర కలెక్షన్స్ | SR కళ్యాణ మండపం అద్భుతమైన కలెక్షన్స్ సాధించడంతో.. తమ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫిగర్స్ వస్తాయని ఆశించారు.

విలక్షణ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీ విష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా రాజ రాజ చోర. కొత్త దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చింది. కామెడీతో పాటు ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాడు హసిత్. ఇక ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే శ్రీ విష్ణు దొంగ పాత్రలో కూడా చాలా బాగా నటించాడు. ఈ వారం విడుదలైన అన్ని సినిమాల కంటే శ్రీ విష్ణు సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాతో పాటు యాంకర్ శ్రీముఖి హీరోయిన్గా నటించిన క్రేజీ అంకుల్స్, సంపూర్ణేష్ బాబు బజార్ రౌడీ, సునీల్ కనబడుట లేదు సినిమాలు ఈ వారం విడుదలయ్యాయి. వాటి కంటే రాజ రాజ చోర బెటర్ టాక్ తెచ్చుకుంది.
దాంతో కచ్చితంగా కలెక్షన్స్ బాగా వస్తాయని అందరూ అనుకున్నారు. దానికి తోడు రెండు వారాల కింద విడుదలైన SR కళ్యాణ మండపం అద్భుతమైన కలెక్షన్స్ సాధించడంతో.. ఖచ్చితంగా తమ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫిగర్స్ వస్తాయని దర్శక నిర్మాతలు ఆశించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఆగస్టు 19 గురువారం రోజు విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. టాక్ బాగానే ఉన్నా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో రాజ రాజ చోరుడు అంతగా సక్సెస్ కాలేకపోయాడు.
మార్నింగ్ మ్యాట్నీలతో పోలిస్తే ఫస్ట్ షో నుంచి కలెక్షన్స్ కాస్త పుంజుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రెండు రోజుల్లో దాదాపు 80 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకైతే రాజ రాజ చోర కలెక్షన్స్ ఆశాజనకంగా లేవు. వీకెండ్ ఖచ్చితంగా పుంజుకుంటుందని నిర్మాతలు నమ్ముతున్నారు. మరి శని, ఆదివారం వచ్చే కలెక్షన్స్‌తోనే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. మేఘా ఆకాష్, సునయిన ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో రవిబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో కేరళకు చెందిన ప్రముఖ నటి మృతి..!
OTT | మెల్లిమెల్లిగా ఓటీటీలు టాలీవుడ్‌ను కమ్మేస్తున్నాయా?
మెగా డాటర్ డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సినిమాలని వదిలేసి బిజినెస్ చేసే ఆలోచనలో మంచు మనోజ్..!
సెక్స్ రాకెట్ నడుపుతున్న మోడల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

