Sunaina | ‘రాజ రాజ చోర’ భామకు పాన్ ఇండియా సినిమా ఛాన్స్
ఇటీవలే 'రాజ రాజ చోర' (Raja Raja Chora) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మరాఠి భామ సునయన. ఈ చిత్రంలో హీరో విష్ణు భార్య పాత్రలో నటించి అందరినీ మెప్పించింది.

ఇటీవలే ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మరాఠి భామ సునయన. ఈ చిత్రంలో హీరో విష్ణు భార్య పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. సునయన (Sunaina) పాత్రకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. కాగా ఈ భామ తాజాగా పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. గతంలో పలు తెలుగు సినిమాలు చేసినా సునయనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
రాజ రాజ చోర చిత్రంతో తన నటనతో దర్శకనిర్మాతల చూపును తనవైపు తిప్పుకుంది సునయన. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన విశాల్ (Vishal)హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ వినోథ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు.
యాక్షన్ థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. విశాల్ నటించిన సామాన్యుడు త్వరలో విడుదల కానుంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ స్వీయనిర్మాణంలో నటిస్తోన్న ఈ చిత్రానికి థు ప శరవణన్ దర్శకుడు. డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోండగా..యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజర్ గా పనిచేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

