Brahma Anandam | ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్‌తో కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్ని పోషించారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. సోమవారం ‘విలేజ్ సాంగ్’ అనే రెండో గీతాన్ని అగ్ర సంగీత దర్శకుడు కీరవాణి విడుదల చేశారు. శాండిల్య స్వరపరచిన ఈ పాటకు సురేష్ బనిశెట్టి సాహిత్యాన్నందించారు. గ్రామీణ అందాలు, అక్కడి ఆటపాటలు, వినోదంతో ఈ పాట మెప్పించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాతామనవళ్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సంపత్‌రాజ్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య పిసపాటి, దర్శకత్వం: ఆర్వీఎస్ నిఖిల్.