రాజ్ తరుణ్.. సూపర్ సుడిగాడు ఆఫ్ టాలీవుడ్..

Tollywood | ఒకటి రెండూ కాదు అరడజన్ ఫ్లాపులు వచ్చిన తర్వాత కూడా రాజ్ తరుణ్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. అందుకే రాజ్ తరుణ్ సుడిగాడు ఆఫ్ టాలీవుడ్ అయిపోయాడు. ప్రస్తుతం ఈయన అనుభవించు రాజా సినిమాతో వస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా టీజర్ విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతోపాటు స్టాండప్ రాహుల్ అనే మరో సినిమాతో కూడా వస్తున్నాడు రాజ్ తరుణ్. హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత.. అదే జోరు చూపించడంలో బొక్క బోర్లా పడ్డాడు. మంచి అంచనాలతో వచ్చిన సినిమాలు దారుణంగా నిరాశపరచడంతో రాజ్ తరుణ్ కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. వరస సినిమాలు చేస్తున్నా కూడా ఆయన కోరుకున్న విజయం రావడం లేదు.
అప్పుడప్పుడో 2015లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత రాజ్ తరుణ్ నటించిన ఏ ఒక్కటి కూడా విజయం సాధించలేదు. మధ్యలో ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు మాత్రం పర్లేదు అనిపించాయి. అప్పటి నుంచి అంధగాడు, రంగులరాట్నం, రాజు గాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే.. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ హిట్స్ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈయన స్టాండప్ రాహుల్, అనుభవించు రాజా సినిమాలలో నటిస్తున్నాడు. కామెడీ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు వస్తున్నాయి. ఇంటి పైన ఇప్పుడు రాజ్ తరుణ్ కెరీర్ ఆధారపడి ఉంది.
ఈ రెండు సినిమాలు అనౌన్స్ చేసినప్పుడు పెద్దగా ఆసక్తిగా అనిపించలేదు. కానీ ఇప్పుడు టీజర్స్ చూసిన తర్వాత విషయం ఉందని అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ కూడా వీటిలో కొత్తగా కనిపిస్తున్నాడు. అటు స్టాండప్ రాహుల్.. ఇటు అనుభవించు రాజా.. కచ్చితంగా తను కోరుకున్న విజయాలు తీసుకొస్తాయని నమ్ముతున్నాడు ఈ హీరో. వీటిలో అనుభవించు రాజా ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండటం విశేషం. నాగార్జున మేనకోడలు సుప్రియ ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. మరి వీటితో రాజ్ తరుణ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood | వాణి విశ్వనాథ్ కూతురితో కోటి కొడుకు సినిమా
Lahari: దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న శ్రీరామ్- లహరి
Ntr: కారు నెంబర్ కోసం తారక్ అంత ఖర్చు పెట్టాడా..!
Sidharth Malhotra: కియారాతో సిద్ధార్థ్ ప్రేమాయణం.. పెళ్లిపై నోరు విప్పిన యువ హీరో
Samantha: సమంతకు భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

