Bhale Unnade | రాజ్ తరుణ్ తాజా సినిమా ‘భలే ఉన్నాడే’. మనీషా కంద్కూర్ కథానాయిక. వర్ధన్ దర్శకుడు. ఎన్వీ కిరణ్‌కుమార్ నిర్మాత. అగ్ర దర్శకుడు మారుతి సమర్పకుడు. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలో ‘సోఫియా..’ అంటూ సాగే పాటను హీరో విశ్వక్సేన్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. దేవ్ రాసిన ఈ పాటను శేఖర్ చంద్ర స్వరపరచగా, కరీముల్లా ఆలపించారు.
విఫల ప్రేమికులకు అంకితమిచ్చేలా ఈ పాటను రూపొందించడం జరిగిందని మేకర్స్ తెలిపారు. అమ్మాయిలంటే ఆమడ దూరంలో వుండే కుర్రాడిగా ఇందులో రాజ్‌తరుణ్ కనిపించనున్నాడు. వీటీవీ గణేశ్, హైపర్ ఆది, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, గోపరాజు రమణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేశ్ బానెల్లా.