సంక్రాంతి బరిలో దిగిన ‘నా సామిరంగ’ చిత్రంలో కీలకమైన పాత్రలో మెప్పించారు యువ హీరో రాజ్‌తరుణ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘భలే ఉన్నాడే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు మారుతి టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రవికిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. జే.శివసాయివర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో రాజ్‌తరుణ్ చిరునవ్వులు చిందిస్తూ ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు కీలక పాత్రలో కనిపించనున్నారు. మనీషా కంద్కూర్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెల్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఆర్ట్: సురేష్ భీమగాని, రచన-దర్శకత్వం: జె.శివసాయివర్ధన్.