Raj Nidimoru | సమంత ఇక సినిమాలు చేయోద్దనుకుంది,నేనే ఒప్పించా .. రాజ్ నిడిమోరు ఎమోషనల్ కామెంట్స్!
Raj Nidimoru | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. విడుదలైన తొలి వారం రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Raj Nidimoru | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. విడుదలైన తొలి వారం రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమంత వ్యక్తిగత జీవితం, కెరీర్, ఈ సినిమా ప్రయాణం గురించి ఆయన పంచుకున్న విషయాలు అందరినీ భావోద్వేగానికి గురి చేశాయి.
మేము ఎన్నో హిందీ ప్రాజెక్టులు చేశాం. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘స్త్రీ’ వంటి ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. కానీ ‘మా ఇంటి బంగారం’ ఇచ్చిన తృప్తి మాత్రం పూర్తిగా భిన్నం. ఈ సినిమా నాకు గుండెకు చాలా దగ్గరైంది. తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది” అని రాజ్ చెప్పారు. సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకున్న రాజ్, ఒక ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ సినిమా ప్రారంభమైన సమయంలో సమంత వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై బయట ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. ఆ సమయంలో ఆమె సినిమాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉండేది. నిజానికి ఇక సినిమాలు చేయకూడదని కూడా అనుకుంది. అయితే కనీసం ఈ ఒక్క సినిమా అయినా చేయాలని నేనే బలవంతం చేసి ఒప్పించాను అని రాజ్ వెల్లడించారు.
సినిమా ప్రకటించిన వెంటనే ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టలేదు. ఓటీటీ హక్కులు ఎలా అమ్ముడవుతాయి? ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు? అనే అనేక సందేహాలు ఉండేవి. అయినా సమంతలోని పూర్తి నటనను బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. అయితే బడ్జెట్ పరిమితులు, సమయాభావం వంటి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి అని ఆయన తెలిపారు. గతంలో కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘స్త్రీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. అనంతరం ‘ఫర్జీ’, ‘గన్స్ అండ్ గులాబ్స్’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్టులతో రాజ్-డీకే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ కూడా అదే జాబితాలో చేరినట్లు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

