పోర్న్ మూవీ చేయమని రాజ్‌కుంద్రా నన్ను కూడా అడిగాడు!

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా తన అడల్ట్ యాప్ కోసం తనను కూడా అడిగాడని మరో మహిళ చెప్పింది. ఓసారి కుంద్రా తనకు నేరుగా ఇదే విషయం అడుగుతూ మెసేజ్ చేశాడని యూట్యూబర్ పునీత్ కౌర్ వెల్లడించింది. హాట్‌షాట్స్ అనే అడల్ట్ యాప్ కోసం పోర్న్ మూవీస్ తీశాడన్న కేసులో రాజ్‌కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
గతంలో బాలీవుడ్ నటీమణులు పూనమ్ పాండే, సాగరికా షోనా సుమన్ కూడా రాజ్‌కుంద్రాపై ఇలాంటి ఆరోపణలు చేశారు. తాజాగా పునీత్ కౌర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాజ్‌కుంద్రా తనను హాట్‌షాట్స్ గురించి అడిగినట్లు చెప్పింది. అంతేకాదు ఈ విషయంపై తన ఇద్దరు స్నేహితులతో చర్చించిన ఓ వీడియోను కూడా ఆమె బయటపెట్టింది. మొదట్లో తాము రాజ్‌కుంద్రా అకౌంట్ హ్యాక్ అయిందేమో అనుకున్నట్లు పునీత్ చెప్పింది.
గత ఫిబ్రవరిలో నటి పూనమ్ పాండే కూడా రాజ్‌కుంద్రాపై ఇవే ఆరోపణలు చేసింది. అటు మరో నటి సాగరికా షోనా సుమన్ అయితే అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. తనను నగ్నంగా ఆడిషన్ చేయాల్సిందిగా కుంద్రా అడిగినట్లు ఆమె ఆరోపించింది. 2019లో పూనమ్ పాండే బాంబే హైకోర్టులో రాజ్‌కుంద్రాపై కేసు ఫైల్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

