UT69 Trailer | ప్రముఖ వ్యాపారవేత్త బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయ్యి జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే రాజ్ కుంద్రా దాదాపు ఏడాది తర్వాత మొదటిసారిగా మీడియాకు ముఖం చూపించారు. నవంబర్ 2022లో పోర్నోగ్రఫీ కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆయన.. అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా బయట ముసుగులు ధరించే కనిపించేవారు. అయితే తాజాగా రాజ్ కుంద్రా తన మాస్క్ తీసి కనిపించారు. రాజ్ కుంద్రా జీవితం ఆధారంగా వస్తున్న బయోపిక్ చిత్రం ‘UT69. ఈ సినిమాను షానవాజ్ అలీ దర్శకత్వం వహిస్తుండగా.. SVS స్టూడియోస్ నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ఈవెంట్లోనే రాజ్ కుంద్రా తన మాస్క్ తీసి కనిపించారు.
ఈ ట్రైలర్ గమనిస్తే.. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన రాజ్‌కుంద్రా ముంబైలోని ఆర్ధర్ రోడ్డు జైలుకి వెళ్లిన అనంతరం జైలులో గడిపిన సమయాన్ని చూపిస్తుంది. ఇక రాజ్ కుంద్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ కుంద్రానే కథానాయకుడిగా నటిస్తున్నాడు. కాగా ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో అశ్లీల వీడియోలను షూట్ చేసి.. ఓ యాప్ ద్వారా వాటిని అప్లోడ్ చేసినట్లు రాజ్‌కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి.