Raid 2 Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రైడ్ 2’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా.. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో తమన్నా ఒక ప్రత్యేక గీతంలో (నషా సాంగ్) నటించబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన పాటను చిత్రబృందం విడుదల చేసింది. నషా నషా అంటూ ఈ పాట సాగగా.. ఇందులో తమన్నా తన డాన్స్‌తో అలరించింది.
ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.